అపోస్తలులకార్యములు 20: 38
క్రాస్-రిఫరెన్స్‌లు
" పౌలు మెడమీద పడి అతనిని ముద్దుపెట్టుకొని, వారు ఓడవరకు అతనిని సాగనంపిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కునుండి బయటికి వచ్చి మూడు మారులు సాష్టాంగ నమస్కారము చేసిన తరవాత వారు ఒకరినొకరు ముద్దుపెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఈలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను.
అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలు లేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.
యెహోవా, యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసికొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను.
ఎజ్రా యేడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు, పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతనియొద్దకు కూడివచ్చి బహుగా ఏడ్వగా
వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు, అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలలమీద ధూళి చల్లుకొని యెలుగెత్తి యేడ్చిరి.
కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
నీయందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసికొని, నా పితురాచారప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవునియెడల కృతజ్ఞుడనై యున్నాను.
ఏలయనగా సింహాసనమధ్యమందుండు గొఱ్ఱపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును, దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచివేయును.
ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.
తన తమ్ము డైన బెన్యామీను మెడమీద పడి యేడ్చెను; బెన్యామీను అతని మెడమీదపడి యేడ్చెను.
యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకనికొకడు వందనములు చేయుడి. క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి.
సహోదరులందరు మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకొని, మీరు ఒకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని యొకరికి ఒకరు వందనములు చేసికొనుడి.
పవిత్రమైన ముద్దుపెట్టుకొని సహోదరులకందరికిని వందనములు చేయుడి.
లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదుర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దుపెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.
అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దుపెట్టుకొన నియ్యక పిచ్చిపట్టి యిట్లు చేసితివి.
అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరుగెత్తి అతనిని కౌగలించుకొని అతని మెడమీద పడి ముద్దుపెట్టుకొనెను; వారిద్దరు కన్నీరు విడిచిరి.
అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.
అతడు ఎలుగెత్తి యేడ్వగా ఐగుప్తీయులును ఫరో యింటివారును వినిరి.
అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకొని వారిమీద పడి యేడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాటలాడిరి.
మోషే తన మామను ఎదుర్కొన పోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలిసికొని గుడారములోనికి వచ్చిరి.
జనులందరును రాజును నది యవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దుపెట్టుకొని దీవించెను; తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్లిపోయెను.
అతడు ఎడ్లను విడిచి ఏలీయావెంట పరుగెత్తి నేను పోయి నా తలిదండ్రులను ముద్దుపెట్టుకొని తిరిగివచ్చి నిన్ను వెంబడించెదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయి రమ్ము, నావలన నీకు నిర్బంధము లేదని చెప్పెను.
వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
ఆ యల్లరి అణగిన తరువాత పౌలు శిష్యులను తనయొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారియొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లుటకు బయలుదేరెను.
మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా వెళ్లి కోసుకును, మరునాడు రొదుకును, అక్కడనుండి పతరకును వచ్చితివిు.
పౌలు ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసెదరేల? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను.