అపోస్తలులకార్యములు 26: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు నేను ప్రభువా, నీవు ఎవడవని అడుగగా ప్రభువు నేను నీవు హింసించుచున్న యేసును."
సంబంధిత రిఫరెన్స్‌లు
అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్చబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను
అతడు హెబ్రీ భాషలో మాటలాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి. అప్పుడతడు ఈలాగు చెప్పసాగెను.
అప్పుడతడు నేలమీద పడి సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను.
ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును;
నేను నేలమీద పడి సౌలా సౌలా, నీవెందుకు, నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని.
అందుకు నేను ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.
నాతోకూడ నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాటలాడినవాని స్వరము వారు వినలేదు.
సుబుద్ధి దయను సంపాదించును విశ్వాసఘాతకుల మార్గము కష్టము.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని యెంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి, మిమ్మును దోచుకొనిన అన్యజనులయొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు.
నేను యెరూషలేము చుట్టునున్న జనులకందరికి మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను; శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యూదా మీదికిని వచ్చును.
ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బలవంతులమా?
యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలిచెను; అందుకతడు చిత్తము ప్రభువా అనెను.
శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా
ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.
యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమైయుండెను, అది హెబ్రీ గ్రీకు రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి.
అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరిగాని యెవనిని చూడక మౌనులై నిలువబడిరి.
అందుకు నేను ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను.
కలహమెక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి మధ్యనుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసికొనిరండని సైనికులకు ఆజ్ఞాపించెను.
యేసుక్రీస్తు దాసుడును, అపొస్తలుడుగా నుండుటకు పిలువబడినవాడును,
ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడు కొనువాడు ధన్యుడు.