లేఖనాలను అన్వేషించండి

దానియేలు 6: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమునుబట్టి రాజా, ముప్పది దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు; ఎవడైన చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా? అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము; ఎవరును దాని రద్దుపరచజాలరనెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

దానియేలు 6:6

కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి రాజగు దర్యావేషూ, చిరంజీవివై యుందువుగాక.

కీర్తనలు 10:9

గుహలోని సింహమువలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు బాధపడువారిని పట్టుకొన పొంచియుందురు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు.

కీర్తనలు 37:32

భక్తిహీనులు నీతిమంతులకొరకు పొంచియుండి వారిని చంపజూతురు.

కీర్తనలు 37:33

వారిచేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపడు వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా ఎంచడు.

కీర్తనలు 137:5

యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.

సామెతలు 28:1

ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు.

మత్తయి 22:21

అందుకాయన ఆలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను.

1పేతురు 4:19

కాబట్టి దేవుని చిత్తప్రకారము బాధపడువారు సత్‌ప్రవర్తన గలవారై, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను.