ఎస్తేరు 2: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక యుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి యుండెను గనుక ఆమె తెలుపలేదు.
పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులై యుండుడి; ఇది ధర్మమే.
నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడవగువుదు, ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది.
వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూసి తెలుపుమనియు, ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతనియొద్దకు పోవలెనని చెప్పుమనియు దాని నతనికిచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను.