లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 1: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 10:16

కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్దనుండి తొలగలేదు.

కీర్తనలు 103:20

యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి.

యెహెజ్కేలు 1:15

ఈ జీవులను నేను చూచుచుండగా నేలమీద ఆ నాలుగింటి యెదుట ముఖముల ప్రక్కను చక్రమువంటిదొకటి కనబడెను.

యెహెజ్కేలు 1:21

జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరుగగా చక్రములును జరుగుచుండెను, అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి నేలనుండి లేవగా ఇవియు వాటితోకూడ లేచెను.

యెహెజ్కేలు 11:22

కెరూబులు తమ రెక్కలు చాచెను, చక్రములును వాటి ప్రక్కనుండెను అంతలో ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైన నుండెను.