లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 1: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" మరియు జీవుల తలలపైన ఆకాశమండలము వంటి విశాలత యున్నట్టుండెను. అది తళతళలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించియుండెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 1:19

ఆ జీవులు కదలగా ఆ చక్రములును వాటి ప్రక్కను జరిగెను, అవి నేలనుండి లేచినప్పుడు చక్రములుకూడ లేచెను.

యెహెజ్కేలు 1:20

ఆత్మ యెక్కడికి పోవునో అక్కడికే, అది పోవలసిన వైపునకే అవియు పోవుచుండెను; జీవికున్న ఆత్మ, చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములును లేచుచుండెను.

యెహెజ్కేలు 10:17

జీవులకున్న ప్రాణము చక్రములలో ఉండెను గనుక అవి నిలువగా ఇవియు నిలిచెను, అవి లేవగా ఇవియు లేచెను

రోమీయులకు 8:2

క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను.

యెహెజ్కేలు 1:12

అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మ యే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను.