యెహెజ్కేలు 17: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" అది చిగిర్చి పైకి పెరుగక విశాలముగా కొమ్మలతో అల్లుకొని గొప్ప ద్రాక్షావల్లి ఆయెను; దాని కొమ్మలు ఆ పక్షిరాజువైపున అల్లుకొనుచుండెను, దాని వేళ్లు క్రిందికి తన్నుచుండెను; ఆలాగున ఆ ద్రాక్షచెట్టు శాఖోపశాఖలుగా వర్థిల్లి రెమ్మలువేసెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు అతడు రాజసంతతిలో ఒకని నేర్పరచి, ఆ రాజ్యము క్షీణించి తిరుగుబాటు చేయలేక యుండునట్లును, తాను చేయించిన నిబంధనను ఆ రాజు గైకొనుటవలన అది నిలిచియుండునట్లును,
మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.
బబులోనురాజైన నెబుకద్రెజరు యూదా దేశములో రాజుగా నియమించిన యోషీయా కుమారుడగు సిద్కియా యెహోయాకీము కుమారుడైన కొన్యాకు ప్రతిగా రాజ్యము చేయుచుండెను.
నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులును, లోయలలో నుండియు కొండలలో నుండియు పారు ఊటలును అగాధ జలములును గల దేశము.
అది గోధుమలు యవలు ద్రాక్షచెట్లు అంజూరపుచెట్లు దానిమ్మపండ్లును గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము.
కరవు అనుకొనకుండ నీవు ఆహారము తిను దేశము; అందులో నీకు ఏ లోపముండదు. అది యినుపరాళ్లు గల దేశము; దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును.
భూపతులకు దండములైనట్టి గట్టిచువ్వలు దానికి కలిగియుండెను, అది మేఘములనంటునంతగా పెరిగెను, విస్తారమైన దాని కొమ్మలు బహు ఎత్తుగా కనబడెను.
అయితే బహు రౌద్రముచేత అది పెరికివేయబడినదై నేలమీద పడవేయబడెను, తూర్పుగాలి విసరగా దాని పండ్లు వాడెను. మరియు దాని గట్టిచువ్వలు తెగి వాడిపోయి అగ్నిచేత కాల్చబడెను.
ఒక్కొకడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొనిపోవుదురు.
నీటికాలువలయొద్ద నాటబడిన నిరవంజిచెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు.
తామరచెట్ల నీడను అది ఆశ్రయించును నదిలోని నిరవంజిచెట్లు దాని చుట్టుకొనియుండును.
ఇశ్రాయేలు వంశస్థులును యూదా వంశస్థులును బయలునకు ధూపార్పణముచేసి నాకు కోపము పుట్టించుటచేత తమంతట తామే చేసిన చెడుతనమునుబట్టి మిమ్మును నాటిన సైన్యములకధిపతియగు యెహోవా మీకు కీడుచేయ నిర్ణయించుకొనియున్నాడు.
నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలముల నిచ్చుచున్నారు; వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు.
కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా?
నీళ్లుండుటవలన అది మిక్కిలి గొప్పదాయెను, లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి యెత్తుగా పెరిగెను, అది యుండుచోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికిని ప్రవహించెను.
అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికుండును.