లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 17: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" పెద్ద రెక్కలును విస్తారమైన యీకెలునుగల యింకొక గొప్ప పక్షిరాజు కలడు. ఆ చెట్టు శాఖలను బాగుగా పెంచి, బహుగా ఫలించు మంచి ద్రాక్షావల్లి యగునట్లుగా అది విస్తార జలముగల మంచి భూమిలో నాటబడియుండినను ఆ పక్షిరాజు తనకు నీరు కట్టవలెనని తన పాదులకాలువలోనుండి అది యా పక్షితట్టు తన వేళ్లను త్రిప్పి తన శాఖలను విడిచెను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 17:14

అతనితో నిబంధనచేసి అతనిచేత ప్రమాణముచేయించి, దేశములోని పరాక్రమవంతులను తీసికొనిపోయెను.

సామెతలు 16:18

నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును

సామెతలు 16:19

గర్విష్ఠులతో దోపుడుసొమ్ము పంచుకొనుటకంటె దీనమనస్సు కలిగి దీనులతో పొత్తుచేయుట మేలు.

కీర్తనలు 44:2

నీవు నీ భుజబలముచేత అన్యజనులను వెళ్లగొట్టి మా పితరులను నాటితివి జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి.

కీర్తనలు 80:8

నీవు ఐగుప్తులోనుండి యొక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్యజనులను వెళ్లగొట్టి దాని నాటితివి

యెషయా 18:5

కోతకాలము రాకమునుపు పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా ఆయన పోటకత్తులచేత ద్రాక్షతీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును.

యెహెజ్కేలు 17:8

కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా?

యెహెజ్కేలు 19:10

మరియు నీకు క్షేమము కలిగియుండగా నీ తల్లి ఫలభరితమై తీగెలతో నిండియుండి విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల్లివలె నుండెను.

యెహెజ్కేలు 29:15

వారికను జనములమీద అతిశయపడకుండునట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యముగా ఉందురు; వారు ఇక రాష్ట్రములమీద ప్రభుత్వము చేయకుండునట్లు నేను వారిని తగ్గించెదను.