యెహెజ్కేలు 38: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీతో కూడిన పారసీకదేశపువారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిరస్త్రాణములను ధరించువారినందరిని నేను బయలుదేరదీసెదను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నేను నీ దవుడలకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.
నిన్ను వెనుకకు త్రిప్పి నడిపించి, ఉత్తరదిక్కున దూరములో ఉన్న నిన్ను బయలుదేరదీసి ఇశ్రాయేలీయుల పర్వతములకు రప్పించి
నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను నా గాలము నీ ముక్కునకు తగిలించెదను నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను.
ఉత్తరదిక్కున దూరముననున్న నీ స్థలములలోనుండి నీవును నీతోకూడ జనములనేకములును గుఱ్రములెక్కి బహు విస్తారమైన సైన్యముగా కూడివచ్చి
అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుఱ్ఱపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని, తుపానువలె అతని మీదపడి దేశముల మీదుగా ప్రవాహమువలె వెళ్లును.
ప్రశస్త వస్త్రములు ధరించినవారును సైన్యాధిపతులును అధికారులును గుఱ్ఱములెక్కు రౌతులును సౌందర్యముగల యౌవనులును అగు అష్షూరువారైన తన పొరుగువారిని అది మోహించెను.
మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగియున్న దావీదునొద్ద చేరిరి; వీరు డాలును ఈటెను వాడుకచేయగల యుద్ధప్రవీణులు, సింహముఖమువంటి ముఖములు గలవారు, కొండలలోనుండు జింకలంత పాదవేగము గలవారు.
అమజ్యా యూదావారినందరిని సమకూర్చి యూదా దేశమంతటను బెన్యామీనీయుల దేశమంతటను వారి వారి పితరుల యిండ్లనుబట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయముగల వారిని లెక్కింపగా, ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు మూడులక్షలమంది కనబడిరి.
గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.
ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేసెను బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చునదేమనగా దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
కావున ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నే నేర్పరచిన పంక్తిని కూర్చుండి గుఱ్ఱములను రౌతులను బలాఢ్యులను ఆయుధస్థులను మీరు కడుపార భక్షింతురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ఇదే యెహోవా వాక్కు ఆ దినమందు నేను గుఱ్ఱములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెఱ్ఱిని పుట్టింతును, యూదావారిమీద నా దృష్టియుంచి జనముల గుఱ్ఱములన్నిటికిని అంధత్వము కలుగజేతును.
గుఱ్ఱపురౌతుల సైన్యముల లెక్క యిరువది కోట్లు; వారి లెక్క యింత అని నేను వింటిని.