యెహెజ్కేలు 38: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతోకూడ వచ్చును."
సంబంధిత రిఫరెన్స్‌లు
పారసీక దేశపువారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.
కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.
కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తారజనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులైయుండిరి.
నీవు ఎదోమీయులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే; యిప్పుడు నీ నగరునందు నీవుండి నీకున్న ఘనతనుబట్టి నీవు అతిశయపడుము. నీవు మాత్రము గాక నీతొకూడ యూదావారును కూలునట్లుగా నీవెందుకు అపాయములో దిగుదువని చెప్పినను
అతడు విలువగల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువగల వస్తువులన్నిటిని వశపరచుకొని, లుబీయులను కూషీయులను తనకు పాదసేవకులుగా చేయును.