లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 42: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఉత్తరదిశను చుట్టును కొలకఱ్ఱతో కొలువగా ఐదువందల బారలును"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 40:3

అక్కడికి ఆయన నన్ను తోడుకొనిరాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడివలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.

జెకర్యా 2:1

మరియు నేను తేరిచూడగా కొలనూలుచేత పట్టుకొనిన యొకడు నాకు కనబడెను.

ప్రకటన 11:1

మరియు ఒకడుచేతికఱ్ఱవంటి కొలకఱ్ఱ నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలతవేసి, ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము.

ప్రకటన 11:2

ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలతవేయక విడిచిపెట్టుము; అది అన్యులకియ్యబడెను, వారు నలువది రెండు నెలలు పరిశుద్ధపట్టణమును కాలితో త్రొక్కుదురు.

యెహెజ్కేలు 45:1

మీరు చీట్లువేసి దేశమును విభాగించునప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి ఇరువదియైదువేల కొలకఱ్ఱల నిడివియు పదివేల కొలకఱ్ఱల వెడల్పును ఉండవలెను, ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును.

యెహెజ్కేలు 45:2

దానిలో పరిశుద్ధస్థలమునకు ఐదువందల కొలకఱ్ఱల చచ్చౌకము ఏర్పడవలెను; దానికి నలుదిశల ఏబది మూరల మైదానముండవలెను,

యెహెజ్కేలు 48:30

పట్టణస్థాన వైశాల్యత ఎంతనగా, ఉత్తరమున నాలుగువేల ఐదువందల కొలకఱ్ఱల పరిమాణము.