యెహెజ్కేలు 43: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" రెండవ దినమున పాప పరిహారార్థబలిగా నిర్దోషమైన యొక మేకపిల్లను అర్పింపవలెను; కోడెచేతను బలిపీఠమునకు పాపపరిహారము చేసినట్లు మేకపిల్లచేతను పాపపరిహారము చేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ కోడె మాంసమును దాని చర్మమును దాని పేడను పాళెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను, అది పాపపరిహారార్థమైన బలి.
పాళెము వెలుపల, బూడిదెను పారపోయు పవిత్ర స్థలమునకు తీసికొనిపోయి అగ్నిలో కట్టెలమీద కాల్చివేయవలెను. బూడిదె పారపోయు చోట దానిని కాల్చివేయవలెను.
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఆ కోడెను దాని చర్మమును దాని మాంసమును దాని పేడను పాళెమునకు అవతల అగ్నిచేత కాల్చివేసెను.
వేటి రక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.
కావున యేసు కూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.