యెహెజ్కేలు 43: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" నరపుత్రుడా, యిది నా గద్దె స్థలము, నా పాదపీఠము; ఇక్కడ నేను ఇశ్రాయేలీయులమధ్య నిత్యమును నివసించెదను, వారు ఇకను జారత్వముచేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి, తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధనామమును అపవిత్రపరచక యుందురు, నాకును వారికిని మధ్య గోడమాత్రముంచి"
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను.
ఆలకించుడి, పట్టణములో అల్లరిధ్వని పుట్టుచున్నది దేవాలయమునుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతికారము చేయుచుండు యెహోవా శబ్దము వినబడుచున్నది.
మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ యేడు పాత్రలను భూమిమీద కుమ్మరించుడని ఆలయములోనుండి గొప్ప స్వరము ఆ యేడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని.
అక్కడికి ఆయన నన్ను తోడుకొనిరాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడివలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను.
మరియు నేను చెవులార వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను ఒక్కొకడు తాను హతము చేయు ఆయుధమును చేతపట్టుకొని పట్టణపు కావలి వారందరును ఇక్కడికి రండి అనెను.
ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని.