యెహెజ్కేలు 47: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" అది హమాతునకును బేరోతాయునకును దమస్కు సరిహద్దునకును హమాతు సరిహద్దునకును మధ్యనున్న సిబ్రయీమునకును హవ్రాను సరిహద్దును ఆనుకొను మధ్యస్థలమైన హాజేరునకును వ్యాపించును."
సంబంధిత రిఫరెన్స్‌లు
పడమటి సరిహద్దు హసరేనాను అను దమస్కు సరిహద్దు పట్టణము, ఉత్తరపు సరిహద్దు హమాతు; ఇది మీకు ఉత్తరపు సరిహద్దు.
తూర్పుదిక్కున హవ్రాను దమస్కు గిలాదులకును ఇశ్రాయేలీయుల దేశమునకును మధ్య యొర్దానునది సరిహద్దుగా ఉండును; సరిహద్దు మొదలుకొని తూర్పు సముద్రమువరకు దాని కొలువవలెను; ఇది మీకు తూర్పు సరిహద్దు.
దక్షిణదిక్కున తామారు మొదలుకొని కాదేషునొద్దనున్న మెరీబా ఊటలవరకును నది మార్గమున మహాసముద్రమునకు మీ సరిహద్దు పోవును; ఇది మీకు దక్షిణపు సరిహద్దు.
పశ్చిమదిక్కున సరిహద్దు మొదలుకొని హమాతునకు పోవు మార్గమువరకు మహాసముద్రము సరిహద్దుగా ఉండును; ఇది మీకు పశ్చిమదిక్కు సరిహద్దు.
గోత్రముల పేరులు ఇవి; దానీయుల కొకభాగము .. అది ఉత్తరదిక్కు సరిహద్దునుండి హమాతునకుపోవు మార్గమువరకు హెత్లోనునకుపోవు సరిహద్దువరకును హసరేనాను అను దమస్కు సరిహద్దువరకును హమాతు సరిహద్దు మార్గమున తూర్పుగాను పడమరగాను వ్యాపించు భూమి.
హోరు కొండయొద్దనుండి హమాతునకు పోవుమార్గమువరకు ఏర్పరచుకొనవలెను. ఆ సరిహద్దు సెదాదువరకు వ్యాపించును.
పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము, అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును.
మరియు దానియొద్ద ఏన్గెదీ పట్టణము మొదలుకొని ఏనెగ్లాయీము పట్టణమువరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలు వేయుదురు; మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలును దానియందు బహు విస్తారముగా నుండును.
దక్షిణదిక్కున తామారునుండి కాదేషులోనున్న మెరీబా ఊటలవరకు నదివెంబడి మహాసముద్రమువరకు గాదీయులకు సరిహద్దు ఏర్పడును.
ఇందుకు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇశ్రాయేలీయులారా, నేను మీమీదికి ఒక జనమును రప్పింతును, వారు హమాతునకు పోవుమార్గము మొదలుకొని అరణ్యపు నదివరకు మిమ్మును బాధింతురు.