యెహెజ్కేలు 5: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షింతురు, కుమారులు తమ తండ్రులను భక్షింతురు, ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించినవారిని నలుదిశల చెదరగొట్టుదును."
సంబంధిత రిఫరెన్స్‌లు
నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపముకంటె అధికము ఎవరును దానిమీద చెయ్యి వేయకుండనే నిమిషములో ఆ పట్టణము పాడుచేయబడెను.
క్షామహతులు భూఫలములు లేక పొడువబడి క్షీణించిపోయెదరు ఖడ్గహతులు క్షామహతులకన్న భాగ్యవంతులు.
యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోను జరుగలేదు; ఆయన మా మీదికిని, మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికిని ఇంత గొప్ప కీడు రప్పించి, తాను చెప్పిన మాటలు నెరవేర్చెను.
అదేమనగా భూమిమీది సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగియున్నాను గనుక మీరు చేసిన దోషక్రియలన్నిటినిబట్టి మిమ్మును శిక్షింతును.
లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా దురదృష్టము వింతైన దురదృష్టము సంభవించుచున్నది,