యెహెజ్కేలు 5: 14
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును."
సంబంధిత రిఫరెన్స్‌లు
దూరముననున్న వారు తెగులుచేత చత్తురు, దగ్గర నున్నవారు ఖడ్గముచేత కూలుదురు, శేషించి ముట్టడివేయబడినవారు క్షామముచేత చత్తురు; ఈ ప్రకారము నేను వారిమీద నా క్రోధము తీర్చుకొందును.
ఇంక కొంతసేపటికి నేను నా క్రోధమును నీమీద కుమ్మరింతును, నీమీద నా కోపమును నెరవేర్చుచు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీ సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించెదను.
ఈలాగున ఆ గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నా కోపము నేను తీర్చుకొని, ఆ గోడకును దానికి పూత పూసినవారికిని పని తీరెనని మీతో చెప్పుదును.
అయితే వారు నా మాట విననొల్లక నామీద తిరుగుబాటు చేసి, తమకిష్టమైన హేయకృత్యములు చేయుట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశములో ఉండగానే నేను నా రౌద్రము వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.
అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి, తామనుసరించి బ్రదుకవలెనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు, నా విధులను గైకొనకయు, నేను నియమించిన విశ్రాంతిదినములను అపవిత్రపరచిరి గనుక, వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాగ్ని వారిమీద కుమ్మరించి నా కోపము వారిమీద తీర్చుకొందునని యనుకొంటిని.
యెహోవా వాక్కు ఇదే డెబ్బది సంవత్సరములు గడచిన తరువాత వారి దోషములనుబట్టి నేను బబులోను రాజును ఆ జనులను కల్దీయుల దేశమును శిక్షింతును; ఆ దేశము ఎప్పుడు పాడుగనుండునట్లు నియమింతును.
యెహోవా తన ఉగ్రతను నెరవేర్చి తన కోపాగ్నిని కుమ్మరించెను సీయోనులో ఆయన అగ్ని రాజబెట్టెను అది దాని పునాదులను కాల్చివేసెను.
సీయోనుకుమారీ, నీ దోషశిక్ష సమాప్తమాయెను ఇకమీదట ఆయన మరెన్నడును నిన్ను చెరలోనికి కొనిపోడు ఎదోముకుమారీ, నీ దోషమునకు ఆయన శిక్ష విధించును నీ పాపములను ఆయన వెల్లడిపరచును.
అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు, యెరూషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తియౌచున్నవని గ్రంథములవలన గ్రహించితిని.
ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు, ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాటలాడుచు ఉగ్రత సమాప్తియగువరకు వృద్ధిపొందును; అంతట నిర్ణయించినది జరుగును.
ఈ విధముగా నీమీదనున్న నా క్రోధమును చల్లార్చుకొందును, నా రోషము నీయెడల మానిపోవును, ఇకను ఆయాసపడకుండ నేను శాంతము తెచ్చుకొందును.
నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.
నేను కూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను.
ఉగ్రతతో వారు నిన్ను శిక్షించునట్లు నా రోషము నీకు చూపుదును, నీ చెవులను నీ ముక్కును వారు తెగగోయుదురు, నీలో శేషించినవారు ఖడ్గముచేత కూలుదురు, నీ కుమారులను నీ కుమార్తెలను వారు పట్టుకొందురు, నీలో శేషించినవారు అగ్నిచేత దహింపబడుదురు.
నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే; నిన్ను శుభ్రపరచుటకు నేను పూనుకొనినను నీవు శుభ్రపడకపోతివి, నా క్రోధమును నీమీద తీర్చుకొనువరకు నీవు శుభ్రపడకయుందువు.
అయ్యో, నమ్మకమైన నగరము వేశ్య ఆయెనే! అది న్యాయముతో నిండియుండెను నీతి దానిలో నివసించెను ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు.
వారికాధారము లేకపోవును.
కావున ప్రభువును ఇశ్రాయేలుయొక్క బలిష్ఠుడును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగున అనుకొనుచున్నాడు ఆహా, నా శత్రువులనుగూర్చి నేనికను ఆయాసపడను నా విరోధులమీద నేను పగతీర్చుకొందును.
అప్పుడతడు నన్ను పిలిచి ఉత్తర దేశములోనికి పోవువాటిని చూడుము; అవి ఉత్తర దేశమందు నా ఆత్మను నెమ్మదిపరచునని నాతో అనెను.
నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు; ఈ కీడు వారికి చేసెదనని నేను చెప్పినమాట వ్యర్థము కాదు.
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా సంతుష్ట హృదయులై నా దేశమును హీనముగా చూచి దోపుడు సొమ్ముగా ఉండుటకై తమకు అది స్వాస్థ్యమని దాని స్వాధీనపరచుకొనిన ఎదోమీయులనందరినిబట్టియు, శేషించిన అన్యజనులనుబట్టియు నారోషాగ్నితో యథార్థముగా మాట ఇచ్చియున్నాను.
కాబట్టి ఇశ్రాయేలు దేశమునుగూర్చి ప్రవచనమెత్తి, పర్వతములతోను కొండలతోను వాగులతోను లోయలతోను ఈ మాట తెలియజెప్పుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు అన్యజనులవలన అవమానము నొందితిరి గనుక రోషముతోను కోపముతోను నేను మాట ఇచ్చియున్నాను.
ఆ దినమున, గోగు ఇశ్రాయేలీయుల దేశముమీదికి రాబోవు ఆ దినమున, నా కోపము బహుగా రగులుకొనును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు
కాబట్టి నేను రోషమును మహా రౌద్రమును గలిగినవాడనై యీలాగు ప్రమాణము చేసితిని. ఇశ్రాయేలీయుల దేశములో మహాకంపము పుట్టును.
ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమువలనను నీతివలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్యపరిపాలన చేయును. సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.
నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తలమీద శిరస్త్రాణముగా ధరించుకొనెను
నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములనుబట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతోషించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు.
శేషించువారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు; తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును.
కాగా హామాను మొర్దెకైకి సిద్ధముచేసిన ఉరి కొయ్యమీద వారు అతనినే ఉరితీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను.
సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆ దినమున దిట్టమైన చోట స్థిరపరచబడిన ఆ మేకు ఊడదీయబడి తెగవేయబడి పడును దానిమీదనున్న భారము నాశనమగును ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చియున్నాడు.
ప్రతిదండనను వస్త్రముగా వేసికొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వీపస్థులకు ప్రతికారము చేయును.
అవిధేయులై యుండుట మానుకొని మీ దుష్టక్రియలనుబట్టి యెవడును ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చకుండునట్లు యూదావారలారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి.
అట్టి కార్యములనుబట్టి నేను దండింపకుందునా? అట్టి జనముమీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు.
మనుష్యులనేమి పశువులనేమి యీ పట్టణపు నివాసులనందరిని హతము చేసెదను; గొప్ప తెగులుచేత వారు చచ్చెదరు.
మరియు వారు యిటు అటు చెదరగొట్టబడుటకై భూ రాజ్యములన్నిటిలోను, నేను వారిని తోలివేయు స్థలములన్నిటిలోను, వారిని భీతికరముగాను నిందాస్పదముగాను సామెతగాను అపహాస్యముగాను శాపాస్పదముగాను ఉండజేసెదను.
ఒకవేళ వారి విన్నపములు యెహోవా దృష్టికి అనుకూలమగునేమో, ఒకవేళ వారు తమ చెడుమార్గము విడుతురేమో, నిజముగా ఈ ప్రజలమీదికి ఉగ్రతయు మహా కోపమును వచ్చునని యెహోవా ప్రకటించియున్నాడు.
కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను రగులుకొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడై యెడారి ఆయెను.
యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయకృత్యములను ఎంచి యికను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేసెను.
శత్రువువలె ఆయన విల్లెక్కుపెట్టి విరోధివలె కుడిచెయ్యి చాపియున్నాడు కంటికి అందమైన వస్తువులన్నిటిని నాశనము చేసియున్నాడు అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సీయోను కుమార్తె గుడారములమీద కుమ్మరించియున్నాడు.
ఈ ప్రకారము నేను నీమీదికి క్షామమును దుష్టమృగములను పంపుదును, అవి నీకు పుత్రహీనత కలుగజేయును, తెగులును ప్రాణహానియు నీకు కలుగును, మరియు నీమీదికి ఖడ్గమును రప్పించెదను; యెహోవానగు నేనే యీలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతకమైన వ్యభిచార మనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచార దృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యములన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు
నా కోపము నీమీద తెప్పించు నీ ప్రవర్తననుబట్టి నీకు తీర్పుతీర్చి, నీవు చేసిన సమస్త హేయకృత్యముల ఫలము నీమీదికి రప్పించుచున్నాను.
నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆ యా దేశములలో వారిని వెళ్లగొట్టిన తరువాత నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు
నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీకుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయుటకై
కావున నా క్రోధము రానిచ్చి, నేను ప్రతికారము చేయునట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండ దానిని వట్టిబండమీద నేనుండనిచ్చితిని.
నిన్ను వట్టిబండగా చేయుదును, వలలు పరచుకొనుటకు చోటగుదువు నీవికను కట్టబడక యుందువు. నేనే మాట యిచ్చియున్నాను; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
నా యిష్టప్రకారము నేను వారిని శిక్షింతును; వారు చేసిన రెండు దోషక్రియలకు నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారిమీదికి వత్తురు.
యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును; ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును.