యెషయా 17: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" మానవులు తమ్మును సృష్టించినవానివైపు చూతురు వారి కన్నులు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబికులలో తప్పించుకొనినవారును తమ్మును హతము చేసినవానిని ఇకను ఆశ్రయింపక సత్యమునుబట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు.
శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవునివైపు తిరుగును.
యెహోవా వారిని కొట్టును స్వస్థపరచవలెనని ఐగుప్తీయులను కొట్టును వారు యెహోవా వైపు తిరుగగా ఆయన వారి ప్రార్థన నంగీకరించి వారిని స్వస్థపరచును.
పాత కోనేటి నీళ్లు నిలుచుటకు ఆ రెండు గోడల మధ్యను చెరువు కట్టితిరి అయినను దాని చేయించిన వానివైపు మీరు చూచిన వారు కారు పూర్వకాలమున దాని నిర్మించినవానిని మీరు లక్ష్యపెట్టకపోతిరి.
శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు యెహోవా మహాత్మ్యమునుబట్టి సముద్రతీరమున నున్నవారు కేకలు వేయుదురు.
అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యెహోవాను ఘనపరచుడి సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.
ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులార చూచెదరు.
యెహోవాయందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుష్యులలో బీదలు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవునియందు అనందించెదరు.
చంచల బుద్ధిగలవారు వివేకులగుదురు సణుగువారు ఉపదేశమునకు లోబడుదురు.
అప్పుడు ఇశ్రాయేలీయులుమేము పాపము చేసియున్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము; దయ చేసి నేడు మమ్మును రక్షింపుమని చెప్పి
యెహోవాను సేవింపవలెనని తమ మధ్యనుండి అన్యదేవతలను తొల గింపగా, ఆయన ఆత్మ ఇశ్రాయేలీయులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేక పోయెను.
అంచెవాండ్రు జెబూలూను దేశమువరకును, ఎఫ్రాయిము మనష్షేల దేశములలోనున్న ప్రతి పట్టణమునకును పోయిరిగాని అచ్చటివారు ఎగతాళిచేసి వారిని అపహసించిరి.
అయినను ఆషేరు మనష్షే జెబూలూను దేశముల వారిలోనుండి కొందరు కృంగిన మనస్సుతో యెరూషలేమునకు వచ్చిరి.
ఎఫ్రాయిము మనష్షే ఇశ్శాఖారు జెబూలూను దేశములనుండి వచ్చిన జనులలో చాలామంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధివిరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా
పరిశుద్ధస్థలముయొక్క శుద్ధీకరణముచొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా
యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను.
ఇదంతయు సమాప్తమైన తరువాత అక్కడనున్న ఇశ్రాయేలువారందరును యూదా పట్టణములకు పోయి, యూదా దేశమంతటను, బెన్యామీను ఎఫ్రాయిము మనష్షే దేశములయందంతటను ఉన్న విగ్రహములను నిర్మూలముచేసి, దేవతాస్తంభములను ముక్కలుగా నరికి, ఉన్నతస్థలములను బలిపీఠములను పడగొట్టిరి; తరువాత ఇశ్రాయేలువారందరును తమ తమ పట్టణములలోనున్న తమ తమ స్వాస్థ్యములకు తిరిగివెళ్లిరి
అక్కడనున్న ఇశ్రాయేలీయులు, ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను ఏడు దినములు ఆచరించిరి.
ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీయులలో పస్కాపండుగ అంత ఘనముగా ఆచరింపబడి యుండలేదు. యోషీయాయు, యాజకులును, లేవీయులును, అక్కడనున్న యూదా ఇశ్రాయేలువారందరును, యెరూషలేము కాపురస్థులును ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కాపండుగను ఆచరించి యుండలేదు.
నీవు వెళ్లి ఉత్తరదిక్కున ఈ మాటలు ప్రకటింపుము ద్రోహినివగు ఇశ్రాయేలూ, తిరిగిరమ్ము; ఇదే యెహోవా వాక్కు. మీమీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేనెల్లప్పుడు కోపించువాడను కాను; ఇదే యెహోవా వాక్కు.
నీ దేవుడైన యెహోవామీద తిరుగుబాటుచేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టుక్రింద అన్యులతో కలిసికొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము; ఇదే యెహోవా వాక్కు.
భ్రష్టులగు పిల్లలారా, తిరిగిరండి, నేను మీ యజమానుడను; ఇదే యెహోవా వాక్కు ఒకానొక పట్టణములోనుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబములోనుండి ఇద్దరినిగాను మిమ్మును తీసికొని సీయోనునకు రప్పించెదను.
ఆ దినములలో యూదా వంశస్థులును ఇశ్రాయేలు వంశస్థులును కలిసి ఉత్తరదేశములోనుండి ప్రయాణమై, మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు.
నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని, రమ్య దేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చెదననుకొని యుంటిని. నీవు నా తండ్రీ అని నాకు మొఱ్ఱపెట్టి నన్ను మానవనుకొంటిని గదా?
అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి; ఇదే యెహోవా వాక్కు.
ఆలకించుడి, చెట్లులేని మెట్టలమీద ఒక స్వరము వినబడుచున్నది; ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచినదానినిబట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి.
భ్రష్టులైన బిడ్డలారా, తిరిగిరండి; మీ అవిశ్వాసమును నేను బాగుచేసెదను; నీవే మా దేవుడవైన యెహోవావు, నీయొద్దకే మేము వచ్చుచున్నాము,
నిశ్చయముగా కొండలమీద జరిగినది మోసకరము, పర్వతములమీద చేసిన ఘోష నిష్‌ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవావలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును.
ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమపడువారి నాట్యములలో కలిసెదవు.
నీవు షోమ్రోను కొండలమీద ద్రాక్షావల్లులను మరల నాటెదవు, నాటువారు వాటి ఫలములను అనుభవించెదరు.
ఎఫ్రాయిము పర్వతములమీద కావలివారు కేకవేసి సీయోనునకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను.
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు యాకోబునుబట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమునుబట్టి ఉత్సాహధ్వని చేయుడి, ప్రకటించుడి స్తుతి చేయుడి యెహోవా, ఇశ్రాయేలులో శేషించిన నీ ప్రజను రక్షింపుమీ అని బతిమాలుడి.
ఉత్తరదేశములోనుండియు నేను వారిని రప్పించుచున్నాను, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులనేమి ప్రసవించు స్త్రీలనేమి భూదిగంతములనుండి అందరిని సమకూర్చుచున్నాను, మహాసంఘమై వారిక్కడికి తిరిగివచ్చెదరు
వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్రిల్లకుండ చక్కగాపోవు బాటను నీళ్ల కాలువలయొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా?
జనులారా, యెహోవా మాట వినుడి; దూరమైన ద్వీపములలోని వారికి దాని ప్రకటింపుడి ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, గొఱ్ఱలకాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి.
తరువాత ఇశ్రాయేలీయులు తిరిగివచ్చి తమ దేవుడైన యెహోవాయొద్దను తమ రాజైన దావీదు నొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయనయొద్దకు వత్తురు.
మనము యెహోవాయొద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును; ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును
ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము.
మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.
అష్షూరీయులచేత రక్షణ నొందగోరము, మేమికను గుఱ్ఱములను ఎక్కము మీరే మాకు దేవుడని మేమికమీదట మాచేతిపనితో చెప్పము; తండ్రిలేనివారియెడల వాత్సల్యము చూపువాడవు నీవే గదా.
అయినను యెహోవా కొరకు నేను ఎదురుచూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును, నా దేవుడు నా ప్రార్థన నాలకించును.
ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరుమాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు.
చెక్కబడిన మీ వెండి ప్రతిమల కప్పును పోతపోసిన మీ బంగారు విగ్రహముల బట్టలను మీరు అపవిత్రపరతురు హేయములని వాటిని పారవేయుదురు. లేచిపొమ్మని దానితో చెప్పుదురు.
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవాయొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్లుచు గుఱ్ఱములను ఆధారము చేసికొని వారి రథములు విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించువారికి శ్రమ.
నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి? నీవు గర్వించి యెవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా?
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులు ద్రాక్షపండ్ల అడలను కోరి యితర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు, దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దానియొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము.
నీచేతిపనికి నీవు మ్రొక్కకుండునట్లు చెక్కిన విగ్రహములును దేవతా స్తంభములును నీ మధ్య ఉండకుండ నాశనముచేతును,
హద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి