యెషయా 65: 21
క్రాస్-రిఫరెన్స్‌లు
" జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు ద్రాక్షతోటలు నాటించుకొని వాటి ఫలముల ననుభవింతురు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను నీకాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను.
వాటి కాలమున ధాన్యపుపనలు ఇల్లు చేరునట్లు పూర్ణవయస్సుగలవాడవై నీవు సమాధికి చేరెదవు.
బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైన నున్నాడా?
దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును.
పాపాత్ములు నూరు మారులు దుష్కార్యముచేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునియందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు,
నీ కాఠిన్యమును, మార్పుపొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును.
సత్ క్రియను ఓపికగా చేయుచు, మహిమను ఘనతను అక్షయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును.
అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడువారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును.
దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడ, శ్రమయు వేదనయు కలుగును.
కడుపు దిగబడునదియు గొడ్డుదియు నీ దేశములోను ఉండదు. నీ దినముల లెక్క సంపూర్తి చేసెదను.
ఆలాగు చేసినయెడల యెహోవా మీ పితరులకిచ్చెదనని ప్రమాణము చేసిన దేశమున మీ దినములును మీ సంతతివారి దినములును భూమికి పైగా ఆకాశము నిలుచునంతకాలము విస్తరించును.
నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తలవెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనియ్యవద్దు.
దీర్ఘాయువుచేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.
అట్టివాడు రెండువేల సంవత్సరములు బ్రదికియు మేలు కానక యున్నయెడల వాని గతి అంతే; అందరును ఒక స్థలమునకే వెళ్లుదురు గదా.
నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు.
సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా అందరును వృద్ధత్వముచేత కఱ్ఱపట్టుకొని, వృద్ధులేమి వృద్ధురాండ్రేమి ఇంకను యెరూషలేము వీధులలో కూర్చుందురు.
మరియొకప్పుడు ఆయన నేను వెళ్లిపోవుచున్నాను; మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే యుండి చనిపోవుదురు; నేను వెళ్లుచోటికి మీరు రాలేరని వారితో చెప్పెను.
ఏలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, మాన్యులును, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేనివారునై యుండవలెననియు,
వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును, అస్థిరులైనవారి మనస్సులను మరులుకొల్పుచు లోభిత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును, శాపగ్రస్తులునైయుండి,