యోబు 13: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివాని చుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు."
సంబంధిత రిఫరెన్స్‌లు
రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
మహా రోగబలముచేత నా వస్త్రము నిరూపమగును మెడ చుట్టునుండు నా చొక్కాయివలె అది నన్ను ఇరికించుచున్నది.
ఆయన నన్ను బురదలోనికి త్రోసెను నేను ధూళియు బూడిదెయునైనట్లున్నాను.
నేను నక్కలకు సోదరుడనైతిని నిప్పుకోళ్ల జతకాడనైతిని.
నా చర్మము నల్లబడి నామీదనుండి ఊడిపోవుచున్నది కాకవలన నా యెముకలు కాగిపోయెను. నా స్వరమండలము దుఃఖస్వరము నిచ్చుచున్నది నా పిల్లనగ్రోవి రోదనశబ్దము ఎత్తుచున్నది.
తన తల్లి గర్భములోనుండి పుట్టినప్పటికే సగముమాంసము క్షీణించిన శిశు శవమువలె ఆమెను ఉండనియ్యకుమని మోషేతో చెప్పగా
జిగటమంటి యిండ్లలో నివసించువారియందు మంటిలో పుట్టినవారియందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవువారియందు మరి ఎన్ని కనుగొనును?
దోషములనుబట్టి నీవు మనుష్యులను గద్దింపులతో శిక్షించునప్పుడు చిమ్మటకొట్టిన వస్త్రమువలె నీవు వారి అందము చెడగొట్టెదవు నరులందరు వట్టి ఊపిరివంటివారు. (సెలా.)
ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను యూదావారికి వత్సపురుగు వలెను నేనుందును.
నా బలము ఏపాటిది? నేను కనిపెట్టుకొనుట యేల? నా అంతము ఏపాటిది? నేను తాళుకొనుట యేల?
వాని శరీరమాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన యెముకలు పైకి పొడుచుకొని వచ్చును
ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.
వస్త్రమును కొరికివేయునట్లు చిమ్మట వారిని కొరికివేయును బొద్దీక గొఱ్ఱబొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయును అయితే నా నీతి నిత్యము నిలుచును నా రక్షణ తరతరములుండును.
మీ ధనము చెడిపోయెను; మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను.