లేఖనాలను అన్వేషించండి

యోబు 14: 6

క్రాస్-రిఫరెన్స్‌లు

" కూలివారివలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించువరకు వారు విశ్రమము నొందునట్లు వారివైపు చూడకయుండుము."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 7:16

అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదు నా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.

యోబు 7:19

ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?

యోబు 10:20

నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశమునకు

కీర్తనలు 39:13

నేను వెళ్లిపోయి లేకపోకమునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకుము.

యోబు 7:1

భూమిమీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినములవంటివి కావా?

యోబు 7:2

నీడను మిగుల నపేక్షించు దాసునివలెను కూలినిమిత్తము కనిపెట్టుకొను కూలివానివలెను

మత్తయి 20:1

ఏలాగనగా పరలోకరాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి

మత్తయి 20:2

దినమునకు ఒక దేనారము చొప్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.

మత్తయి 20:3

తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంతవీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి

మత్తయి 20:4

మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.

మత్తయి 20:5

దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.

మత్తయి 20:6

తిరిగి దాదాపు అయిదు గంటలకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా

మత్తయి 20:7

వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.

మత్తయి 20:8

సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చినవారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.

లేవీయకాండము 25:50

అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరమువరకు తన్ను కొనినవానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలెను. తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను.