లేఖనాలను అన్వేషించండి

యోబు 23: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆయన పనులు జరిగించు ఉత్తరదిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణదిశకు ఆయన ముఖము త్రిప్పుకొనియున్నాడు నేనాయనను కనుగొనలేను."

సంబంధిత రిఫరెన్స్‌లు

కీర్తనలు 89:46

యెహోవా, ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును?

యెషయా 8:17

యాకోబు వంశమునకు తన ముఖమును మరుగుచేసికొను యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూచుచున్నాను ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను.

యోబు 9:11

ఇదిగో ఆయన నా సమీపమున గడచిపోవుచున్నాడు గాని నేనాయనను కనుగొనలేను నా చేరువను పోవుచున్నాడు గాని ఆయన నాకు కనబడడు.

యోబు 10:13

అయినను నా లోపములనుగూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి ఈ అభిప్రాయము నీకుండెనని నేనెరుగుదును.

యోబు 34:29

ఆయన సమాధానము కలుగజేసినయెడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనినయెడల ఆయనను చూడగలవాడెవడు? అది అనేకులను గూర్చినదైనను ఒకటే, ఒకని గూర్చినదైనను ఒకటే

యోబు 42:5

వినికిడిచేత నిన్నుగూర్చిన వార్త నేను వింటిని అయితే ఇప్పుడు నేను కన్నులార నిన్ను చూచుచున్నాను.

కీర్తనలు 10:1

యెహోవా, నీ వెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు?

కీర్తనలు 139:5

వెనుకను ముందును నీవు నన్ను ఆవరించియున్నావు నీ చేయి నామీద ఉంచియున్నావు.