లేఖనాలను అన్వేషించండి

యోబు 24: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు తమ యజమానుల గోడలలోపల నూనె గానుగలను ఆడించుదురు ద్రాక్ష గానుగలను త్రొక్కుచు దప్పిగలవారై యుందురు."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 25:4

నూర్చెడియెద్దు మూతికి చిక్కము వేయకూడదు.

యిర్మియా 22:13

నీతి తప్పి తన నగరును స్థాపించువానికి శ్రమ; న్యాయము తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు, జీతమియ్యక తన పొరుగువానిచేత ఊరకయే కొలువు చేయించుకొనువానికి శ్రమ.

యాకోబు 5:4

ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగపట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి.

ద్వితియోపదేశాకాండము 24:14

నీ సహోదరులలోనేమి నీ దేశమందలి నీ గ్రామములలోనున్న పరదేశులలోనేమి దీనదరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలి ఆనాడియ్యవలెను.

కొలొస్సయులకు 4:1

యజమానులారా, పరలోకములో మీకును యజమానుడున్నాడని యెరిగి, న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసులయెడల చేయుడి.