లేఖనాలను అన్వేషించండి

యోబు 27: 4

క్రాస్-రిఫరెన్స్‌లు

" నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 13:7

దేవుని పక్షముగా మీరు అన్యాయ వాదన చేయుదురా? ఆయన పక్షముగా మీరు మోసములు పలుకుదురా?

యోబు 34:6

న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు.

యోహాను 8:55

మీరు ఆయనను ఎరుగరు, నేనాయనను ఎరుగుదును; ఆయనను ఎరుగనని నేను చెప్పినయెడల మీవలె నేనును అబద్ధికుడనైయుందును గాని, నేనాయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను.

2కొరిందీయులకు 11:10

క్రీస్తు సత్యము నాయందు ఉండుటవలన అకయ ప్రాంతములయందు నేనీలాగు అతిశయపడకుండ, నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరముకాదు.

యోబు 6:29

అన్యాయము లేకుండ నా సంగతి మరల విచారించుడి మరల విచారించుడి, నేను నిర్దోషినిగా కనబడుదును.

యోబు 32:1

యోబు తన దృష్టియందు తాను నీతిమంతుడై యున్నాడని ఆ ముగ్గురు మనుష్యులు తెలిసికొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి.

యోబు 33:3

నామాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నవి నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును.