లేఖనాలను అన్వేషించండి

యోబు 32: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" అయితే ఎలీహు ఆ ముగ్గురు మనుష్యులు ప్రత్యుత్తరమేమియు ఇయ్యకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 32:2

అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.

నిర్గమకాండము 32:19

అతడు పాళెమునకు సమీపింపగా, ఆ దూడను, వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను; అతడు కొండదిగువను తనచేతులలోనుండి ఆ పలకలను పడవేసి వాటిని పగులగొట్టెను

యోబు 42:7

యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఈలాగు సెలవిచ్చెను నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీమీదను నీ ఇద్దరు స్నేహితులమీదను మండుచున్నది