యోబు 33: 32
క్రాస్-రిఫరెన్స్‌లు
" చెప్పవలసిన మాట యేదైన నీకున్నయెడల నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము, నీవు నీతిమంతుడవని స్థాపింప గోరుచున్నాను. "
సంబంధిత రిఫరెన్స్‌లు
నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు.
నీ మాటలవలన నీ పాపము తెలియబడుచున్నది. వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు.
మీ తలంపులు నేనెరుగుదును మీరు నామీద అన్యాయముగా పన్నుచున్న పన్నాగములు నాకు తెలిసినవి.
నీ చెడుతనము గొప్పది కాదా? నీ దోషములు మితిలేనివి కావా?
ఏమియు ఇయ్యకయే నీ సోదరులయొద్ద నీవు తాకట్టు పుచ్చుకొంటివి వస్త్రహీనుల బట్టలను తీసికొంటివి
దప్పిచేత ఆయాసపడినవారికి నీళ్లియ్యవైతివి ఆకలిగొనినవానికి అన్నము పెట్టకపోతివి.
బాహుబలముగల మనుష్యునికే భూమి ప్రాప్తించును ఘనుడని యెంచబడినవాడు దానిలో నివసించును.
విధవరాండ్రను వట్టిచేతులతో పంపివేసితివి తండ్రిలేనివారిచేతులు విరుగగొట్టితివి.
మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
నాతో వ్యాజ్యెమాడ చూచువాడెవడు? ఎవడైన నుండినయెడల నేను నోరుమూసికొని ప్రాణము విడిచెదను.
నీచేతనైనయెడల నాకుత్తరమిమ్ము నా యెదుట నీ వాదము సిద్ధపరచుకొనుము వ్యాజ్యెమాడుము.
నీకిష్టము వచ్చినట్లు ఆయన ప్రతికారము చేయునా? లేనియెడల నీవుందువా? నేను కాదు నీవే నిశ్చయింపవలెను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము.