యోబు 34: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" న్యాయవంతుడనై యుండియు నేను అబద్దికునిగా ఎంచబడుచున్నాను నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెనని యోబు అనుచున్నాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.
మీరు చెప్పినది న్యాయమని నేనేమాత్రమును ఒప్పుకొనను మరణమగువరకు నేనెంతమాత్రమును యథార్థతను విడువను.
నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు.
సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను.
ఆయన ఆలకింపక పెనుగాలిచేత నన్ను నలుగగొట్టుచున్నాడు నిర్ణిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు
నా ఉపదేశము నిర్దోషమనియు దేవా, నీదృష్టికి నేను పవిత్రుడననియు నీవనుచున్నావే.
అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకెయేలు కుమారుడునగు ఎలీహు, యోబు దేవునికంటె తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి ఆతనిమీద బహుగా కోపగించెను.
నీవు నా న్యాయమును బొత్తిగా కొట్టివేసెదవా? నిర్దోషివని నీవు తీర్పుపొందుటకై నామీద అపరాధము మోపుదువా?
నా బాధ యేల యెడతెగనిదాయెను? నా గాయము ఏల ఘోరమైనదాయెను? అది స్వస్థత నొందకపోనేల? నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వవుదువా? నిలువని జలములవవుదువా?
నీ గాయముచేత నీవు అరచెదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు; నీ పాపములు విస్తరించినందున నీ దోషములనుబట్టి నేను నిన్ను ఈలాగు చేయుచున్నాను.