యోబు 37: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" దక్షిణపు గాలి వీచుటచేత ఉబ్బవేయునప్పుడు నీ వస్త్రములెట్లు వెచ్చబడినది నీకు తెలియునా?"
సంబంధిత రిఫరెన్స్‌లు
వేసవి రాగానే అవి మాయమైపోవును వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును.
కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను విప్పగలవా?
ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నియు కరిగిపోవును ఆయన తనగాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును,
దక్షిణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; ఆలాగే జరుగును.
గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును.
గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.
మరియు దక్షిణపు గాలి మెల్లగా విసరుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి, క్రేతు దరిని ఓడ నడిపించిరి.