లేఖనాలను అన్వేషించండి

యోబు 7: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయెదను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 10:14

నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు.

యోబు 13:23

నా దోషములెన్ని? నా పాపములెన్ని? నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయుము.

యోబు 13:24

నీవేల నీ ముఖమును మరుగుచేసికొంటివి? నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు?

యెషయా 64:9

యెహోవా, అత్యధికముగా కోపపడకుము మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకము చేసికొనకుము చిత్తగించుము, చూడుము, దయచేయుము, మేమందరము నీ ప్రజలమే గదా.

విలాపవాక్యములు 3:42

మేము తిరుగుబాటు చేసినవారము ద్రోహులము నీవు మమ్మును క్షమింపలేదు.

విలాపవాక్యములు 3:43

కోపము ధరించుకొనినవాడవై నీవు మమ్మును తరుముచున్నావు దయతలచక మమ్మును చంపుచున్నావు.

విలాపవాక్యములు 3:44

మా ప్రార్థన నీయొద్ద చేరకుండ నీవు మేఘముచేత నిన్ను కప్పుకొనియున్నావు.

విలాపవాక్యములు 5:20

నీవు మమ్మునెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?

విలాపవాక్యములు 5:21

యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.

విలాపవాక్యములు 5:22

నీవు మమ్మును బొత్తిగా విసర్జించియున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.

2సమూయేలు 24:10

జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవిచేయగా

మీకా 7:18

తన స్వాస్థ్యములో శేషించినవారి దోషమును పరిహరించి, వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు.

మీకా 7:19

ఆయన మరల మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటిని సముద్రపు అగాధములలో నీవు పడవేతువు.

హోషేయ 14:2

మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.

యోహాను 1:29

మరువాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.

తీతుకు 2:14

ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను.

1యోహాను 1:9

మన పాపములను మనము ఒప్పుకొనినయెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.

1యోహాను 3:5

పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెనని మీకు తెలియును; ఆయనయందు పాపమేమియు లేదు.

యోబు 3:13

లేనియెడల నేనిప్పుడు పండుకొని నిమ్మళించియుందును నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును

యోబు 17:14

నీవు నాకు తండ్రివని గోతితోను నీవు నాకు తల్లివని చెల్లెలవని పురుగుతోను నేను మనవి చేయుచున్నాను.

యోబు 21:32

వారు సమాధికి తేబడుదురు సమాధి శ్రద్ధగా కావలి కాయబడును

యోబు 21:33

పల్లములోని మంటి పెల్లలు వారికి ఇంపుగానున్నవి మనుష్యులందరు వారివెంబడి పోవుదురు ఆలాగుననే లెక్క లేనంతమంది వారికి ముందుగా పోయిరి.

ప్రసంగి 12:7

మన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవునియొద్దకు మరల పోవును.

యెషయా 26:19

మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్స హించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.

దానియేలు 12:2

మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.

యోబు 7:18

ప్రతి పగలు నీవతని దర్శింపనేల? ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?

కీర్తనలు 37:36

అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను నేను వెదకితిని గాని వాడు కనబడకపోయెను.

కీర్తనలు 103:15

నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవిపువ్వు పూయునట్లు వాడు పూయును.

2సమూయేలు 12:13

నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.

యోబు 7:8

నన్ను చూచువారి కన్ను ఇకమీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును.

యోబు 8:22

అయితే ఇంకను ఆయన నీకు నోటినిండ నవ్వు కలుగజేయును. ప్రహర్షముతో నీ పెదవులను నింపును.

యోబు 9:21

నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టములేదు నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే.

యోబు 14:12

ఆకాశము గతించిపోవువరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.

యోబు 14:15

ఆలాగుండినయెడల నీవు పిలిచెదవు నేను నీకు ప్రత్యుత్తరమిచ్చెదను నీ హస్తకృత్యము ఎడల నీకు ఇష్టము కలుగును.

యోబు 30:21

నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు

కీర్తనలు 22:15

నా బలము యెండిపోయి చిల్లపెంకువలె ఆయెను నా నాలుక నా దౌడను అంటుకొనియున్నది నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసియున్నావు.

కీర్తనలు 31:2

నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారముగల యిల్లుగాను ఉండుము.

కీర్తనలు 37:10

ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.

కీర్తనలు 69:17

నీ సేవకునికి విముఖుడవై యుండకుము నేను ఇబ్బందిలోనున్నాను త్వరగా నాకు ఉత్తరమిమ్ము.

కీర్తనలు 102:2

నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తరమిమ్ము.

కీర్తనలు 103:14

మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసికొనుచున్నాడు.

కీర్తనలు 141:1

యెహోవా నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నాయొద్దకు త్వరపడి రమ్ము నేను మొఱ్ఱపెట్టగా నా మాటకు చెవియొగ్గుము

యిర్మియా 31:15

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి, రామాలో అంగలార్పును మహా రోదనధ్వనియు వినబడుచున్నవి; రాహేలు తన పిల్లలనుగూర్చి యేడ్చుచున్నది; ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారినిగూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది.

విలాపవాక్యములు 5:7

మా తండ్రులు పాపముచేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.

హెబ్రీయులకు 9:26

అట్లయినయెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకై యొక్కసారే ప్రత్యక్షపరచబడెను