లేఖనాలను అన్వేషించండి

యోహాను 1: 36

క్రాస్-రిఫరెన్స్‌లు

" అతడు నడుచుచున్న యేసువైపు చూచి ఇదిగో దేవుని గొఱ్ఱపిల్ల అని చెప్పెను. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 3:25

శుద్ధీకరణాచారమునుగూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను.

యోహాను 3:26

గనుక వారు యోహాను నొద్దకు వచ్చి బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతో కూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో, ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి.

మలాకీ 3:16

అప్పుడు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను.