లేఖనాలను అన్వేషించండి

యోహాను 16: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవునియొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 16:25

ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పితిని; అయితే నేనిక యెన్నడును గూఢార్థముగా మీతో మాటలాడక తండ్రినిగూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది.

న్యాయాధిపతులు 14:12

అప్పుడు సమ్సోనుమీకిష్టమైనయెడల నేను మీ యెదుట ఒక విప్పుడు కథను వేసెదను; మీరు ఈ విందు జరుగు ఏడు దినములలోగా దాని భావమును నాకు తెలిపినయెడల నేను ముప్పది సన్నపు నారబట్టలను ముప్పది దుస్తులను మీ కిచ్చెదను.

మత్తయి 10:27

చీకటిలో నేను మీతో చెప్పునది మీరు వెలుగులో చెప్పుడి; చెవిలో మీకు చెప్పబడినది మేడలమీద ప్రకటించుడి.

మత్తయి 15:15

అందుకు పేతురు ఈ ఉపమానభావము మాకు తెలుపుమని ఆయనను అడుగగా

మార్కు 8:32

ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయిపట్టుకొని ఆయనను గద్దింపసాగెను

మార్కు 9:10

మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.

యోహాను 11:14

కావున యేసు లాజరు చనిపోయెను,

2కొరిందీయులకు 3:12

తగ్గిపోవుచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖముమీద ముసుకు వేసికొనెను.