లేఖనాలను అన్వేషించండి

యోహాను 21: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు."

సంబంధిత రిఫరెన్స్‌లు

లూకా 5:6

వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా

లూకా 5:7

వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.

లూకా 5:8

సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్ల యెదుట సాగిలపడి ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.

అపోస్తలులకార్యములు 2:41

కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.