లేఖనాలను అన్వేషించండి

యోహాను 7: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" యేసు వారిని చూచి నేను ఒక కార్యము చేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోహాను 8:48

అందుకు యూదులు నీవు సమరయుడవును దయ్యము పట్టినవాడవును అని మేము చెప్పుమాట సరియేగదా అని ఆయనతో చెప్పగా

యోహాను 8:52

అందుకు యూదులు నీవు దయ్యము పట్టినవాడవని యిప్పుడెరుగుదుము; అబ్రాహామును ప్రవక్తలును చనిపోయిరి; అయినను ఒకడు నా మాట గైకొనినయెడల వాడు ఎన్నడును మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు

యోహాను 10:20

వారిలో అనేకులు వాడు దయ్యము పట్టినవాడు, వెఱ్ఱివాడు; వాని మాట ఎందుకు వినుచున్నారనిరి.

మత్తయి 10:25

శిష్యుడు తన బోధకునివలెను దాసుడు తన యజమానునివలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయెల్జెబూలని వారు పేరుపెట్టి యుండినయెడల ఆయన యింటివారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా.

మత్తయి 11:18

యోహాను తినకయు త్రాగకయు వచ్చెను. గనుక వీడు దయ్యముపట్టినవాడని వారనుచున్నారు.

మత్తయి 11:19

మనుష్యకుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడునని వారనుచున్నారు. అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలనుబట్టి తీర్పుపొందుననెను.

మత్తయి 12:24

పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలననే దయ్యములను వెళ్లగొట్టుచున్నాడు గాని మరియొకనివలన కాదనిరి.

మార్కు 3:21

ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

మార్కు 3:22

యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి.

మార్కు 3:30

ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.

అపోస్తలులకార్యములు 26:24

అతడు ఈలాగు సమాధానము చెప్పుకొనుచుండగా ఫేస్తు పౌలా, నీవు వెఱ్ఱివాడవు, అతివిద్య వలన నీకు వెఱ్ఱిపట్టినదని గొప్ప శబ్దముతో చెప్పెను.

కీర్తనలు 22:6

నేను నరుడను కాను నేను పురుగును నరులచేత నిందింపబడినవాడను ప్రజలచేత తృణీకరింపబడిన వాడను.

మత్తయి 5:22

నేను మీతో చెప్పునదేమనగా తన సహోదరునిమీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహా సభకు లోనగును; ద్రోహీ అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును.

లూకా 11:15

అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతియైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి.

యోహాను 5:16

ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.

యోహాను 7:25

యెరూషలేమువారిలో కొందరువారు చంప వెదకువాడు ఈయనే కాడా?

యోహాను 8:22

అందుకు యూదులు నేను వెళ్లుచోటికి మీరు రాలేరని యీయన చెప్పుచున్నాడే; తన్ను తానే చంపుకొనునా అని చెప్పుకొనుచుండిరి.