యెహోషువ 2: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆమె యిల్లు పట్టణపు ప్రాకారముమీద నుండెను, ఆమె ప్రాకారము మీద నివసించునది గనుక త్రాడువేసి కిటికిద్వారా వారిని దింపెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.
తరువాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి
సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగియై యున్నాడని చెప్పెను.
దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతని చంపునట్లుగా మంచముతో అతని తీసికొనిరండని వారితో చెప్పగా
ఆ దూతలు వచ్చి లోపల చొచ్చి చూచినప్పుడు తలతట్టున మేకబొచ్చుగల యొకటి మంచము మీద కనబడెను.
అప్పుడు సౌలు తప్పించుకొని పోవునట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్నీలాగున ఎందుకు మోసపుచ్చితివని మీకాలు నడుగగా మీకాలు నెనెందుకు నిన్ను చంపవలెను? నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను.
గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడగుండ అతనిని క్రిందికి దింపిరి.
అప్పుడు నేను కిటికీగుండ గోడమీదనుండి గంపలో దింపబడి అతని చేతిలోనుండి తప్పించుకొనిపోతిని.
యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను; ప్రజలందరు తమ యెదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి.
వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారువచ్చి యూదుల సమాజమందిరములో ప్రవేశించిరి.