యెహోషువ 2: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారు వెళ్లి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చువరకు మూడు దినములు అక్కడ నివ సించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెద కిరి గాని వారు కనబడలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యము గలిగి యీటె విసిరెను. దావీదు అతని యెదుటనుండి తప్పించుకొనినందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రియందు తప్పించుకొని పారిపోయెను.
ఉదయమున అతని చంపవలెనని పొంచియుండి దావీదును పట్టుకొనుటకై సౌలు అతని యింటికి దూతలను పంపగా దావీదు భార్యయైన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకొంటేనే గాని రేపు నీవు చంపబడుదువని చెప్పి
కిటికీగుండ దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయెను.
అబ్షాలోము సేవకులు ఆ యింటి ఆమెయొద్దకు వచ్చి అహిమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగగా ఆమె వారు ఏరుదాటి పోయిరని వారితో చెప్పెను గనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగివచ్చిరి.
కావున నీ దర్శనకాలమందు భక్తిగలవారందరు నిన్ను ప్రార్థన చేయుదురు. విస్తార జలప్రవాహములు పొరలివచ్చినను నిశ్చయముగా అవి వారిమీదికి రావు.
నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము
ఆమెమిమ్మును తరుమబోయినవారు మీకెదు రుగా వచ్చెదరేమో, మీరు కొండలకువెళ్లి తరుమబోయిన వారు తిరిగి వచ్చువరకు మూడుదినములు అచ్చట దాగి యుండుడి, తరువాత మీ త్రోవను వెళ్లుడని వారితో అనగా
ఈ పట్టణ మును దీనిలో నున్నది యావత్తును యెహోవావలన శపింప బడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆ యింటనున్న వారంద రును మాత్రమే బ్రదుకుదురు.