లేవీయకాండము 4: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి పరిశుద్ధ మందిరము యొక్క అడ్డతెర యెదుట ఆ రక్తములో కొంచెము ఏడు మారులు యెహోవా సన్నిధిని ప్రోక్షింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెరవైపున యెహోవా సన్నిధిని ఏడు మారులు దాని ప్రోక్షింపవలెను.
ఇది పాపపరిహారార్థబలి. యాజకుడు పాపపరిహారార్థబలి పశురక్తములో కొంచెము తన వ్రేలితో తీసి, దహనబలిపీఠము కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును దహనబలిపీఠము అడుగున పోయవలెను.
యాజకుడు దాని రక్తములో కొంచెము వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, దాని రక్తశేషమును ఆ పీఠము అడుగున పోయవలెను.
యాజకుడు పాపపరిహారార్థబలియగు పశువు రక్తములో కొంచెము తన వ్రేలితో తీసి దహనబలిపీఠపు కొమ్ములమీద చమిరి, ఆ పీఠము అడుగున ఆ రక్తశేషమంతయు పోయవలెను.
దాని వధించిన తరువాత మోషే దాని రక్తమును తీసి బలిపీఠపు కొమ్ములచుట్టు వ్రేలితో దాని చమిరి బలిపీఠము విషయమై పాపపరిహారము చేసి దాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము అడుగున రక్తమును పోసి దాని ప్రతిష్ఠించెను.
అహరోను కుమారులు దాని రక్తమును అతనియొద్దకు తేగా అతడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి బలిపీఠపు కొమ్ములమీద దాని చమిరి బలిపీఠము అడుగున ఆ రక్తమును పోసెను.
అప్పుడతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసికొని తూర్పుప్రక్కను కరుణాపీఠముమీద తన వ్రేలితో ప్రోక్షించి, కరుణాపీఠము ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను.
యేడుమారులు తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము దానిమీద ప్రోక్షించి దాని పవిత్రపరచి ఇశ్రాయేలీయుల అపవిత్రతను పోగొట్టి దానిని పరిశుద్ధపరచవలెను.
యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలెను;
అప్పుడు యాజకుడు తన యెడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని ఏడుమారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను.
అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువనూనెను పవిత్రత పొందగోరువాని తలమీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను.
తన యెడమచేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని ఏడు మారులు ప్రోక్షింపవలెను.
మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను, అనగా ఏడేసి యేండ్లుగల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ యేడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలుబది తొమ్మిది సంవత్సరములగును.
ఇవన్నియు సంభవించినను మీరింక నా మాటలు విననియెడల నేను మీ పాపములనుబట్టి మరి ఏడంతలుగా మిమ్మును దండించెదను.
నేనుకూడ మీకు విరోధముగా నడిచెదను; మీ పాపములనుబట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.
నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములనుబట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
ఆలాగు ఆరు దినములు చేయుచు రావలెను. ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడువవలెను. ఏడవ దినమున మీరు ఏడు మారులు పట్టణముచుట్టు తిరుగుచుండగా ఆ యాజకులు బూరల నూదవలెను.
యెహోషువ ప్రజల కాజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలుకొమ్ము బూరలను ఏడు యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు, ఆ బూరలను ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారివెంట నడిచెను.
అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను.
నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను.
కుష్ఠు విషయములో పవిత్రత పొందగోరువానిమీద ఏడుమారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను.