లూకా 16: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
తాము పోయిన తరువాత తమ ఇంటిమీద వారికి చింత ఏమి?
మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరల అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటె రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను.
లోకుల చేతిలోనుండి ఈ జీవితకాలములోనే తమ పాలు పొందిన యీ లోకుల చేతిలోనుండి నీ హస్తబలముచేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు కుమారులు కలిగి తృప్తినొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడచిపెట్టుదురు.
ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు.
స్వాతిశయ పూర్ణులకును వారి నోటిమాటనుబట్టి వారి ననుసరించువారికిని ఇదే గతి.
కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములోనుండి నిన్ను పెల్లగించును సజీవుల దేశములోనుండి నిన్ను నిర్మూలము చేయును.(సెలా.)
సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటిని నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటియందు అసహ్యపడితిని.