లూకా 8: 18
క్రాస్-రిఫరెన్స్‌లు
" కలిగినవానికి ఇయ్యబడును, లేనివాని యొద్దనుండి తనకు కలదని అనుకొనునది కూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరుగైనదేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును.
గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చువరకు, దేనినిగూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన కలుగును.
అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును
రహస్యమేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచబడుటకే గాని యేదియు మరుగు చేయబడలేదు
ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభము మీదనే పెట్టును.
దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.