లేఖనాలను అన్వేషించండి

మార్కు 10: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" యేసు అతని చూచి అతని ప్రేమించి నీకు ఒకటి కొదువగానున్నది; నీవు వెళ్లి నీకు కలిగినవన్నియు అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును; నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

యెషయా 58:2

తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నాయొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలిసికొన నిచ్ఛ కనుపరచుదురు తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారడుగుదురు దేవుడు తమకు ప్రత్యక్షుడు కావలెనని యిచ్ఛయింతురు.

యెహెజ్కేలు 5:14

ఆలాగు నీ చుట్టునున్న అన్యజనులలో నిన్ను చూచు వారందరి దృష్టికి పాడుగాను నిందాస్పదముగాను నేను నిన్ను చేయుదును.

యెహెజ్కేలు 33:31

నా జనులు రాదగిన విధముగా వారు నీయొద్దకు వచ్చి, నా జనులైనట్టుగా నీ యెదుట కూర్చుండి నీ మాటలు విందురుగాని వాటి ననుసరించి ప్రవర్తింపరు, వారు నోటితో ఎంతో ప్రేమ కనుపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది.

యెహెజ్కేలు 33:32

నీవు వారికి వాద్యము బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు, వారు నీ మాటలు విందురుగాని వాటిని అనుసరించి నడుచుకొనరు.

మలాకీ 3:8

మానవుడు దేవునియొద్ద దొంగిలునా? అయితే మీరు నాయొద్ద దొంగిలితిరి; దేని విషయములో మేము నీయొద్ద దొంగిలితిమని మీరందురు. పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి.

మత్తయి 19:20

అందుకు ఆ యౌవనుడు ఇవన్నియు అనుసరించుచునే యున్నాను; ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను.

లూకా 10:29

అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడు అవునుగాని నా పొరుగువాడెవడని యేసునడిగెను.

లూకా 18:11

పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలె నైనను, ఈ సుంకరివలె నైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.

లూకా 18:12

వారమునకు రెండుమారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించుచుండెను.

రోమీయులకు 7:9

ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని.

ఫిలిప్పీయులకు 3:6

ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని.

2తిమోతి 3:5

పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము.

లూకా 18:21

అందుకతడు బాల్యమునుండి వీటినన్నిటిని అనుసరించుచునే యున్నాననెను.

1తిమోతి 4:8

శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.