మార్కు 7: 28
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకామె నిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందులయెదుట వేయకుడి; వేసినయెడల అవి యొకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీమీద పడి మిమ్మును చీల్చివేయును.
యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని
అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చి ఈమె మనవెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపివేయుమని ఆయనను వేడుకొనగా
ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదనెను
అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.
అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా
ఆమె నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినునుగదా అని చెప్పెను.
అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనొందెను.
అందుకు ఆయన వెళ్లుము, నేను దూరముగా అన్యజనులయొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పెను.
నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమునుగూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతిగలవారికి పరిచారకుడాయెను.
ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, పరదేశులును, వాగ్దాననిబంధనలు లేని పరజనులును, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై యుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.
అందుకాయన పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా
అందుకతడు కుమారుడా, నీవెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,
ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలయకు వెళ్లెను.