లేఖనాలను అన్వేషించండి

మత్తయి 17: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" ప్రభువా, నా కుమారుని కరుణింపుము; వాడు చాంద్రరోగియై మిక్కిలి బాధపడుచున్నాడు; ఏలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరుచుగా పడుచున్నాడు;"

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 9:14

వారు శిష్యులయొద్దకు వచ్చి, వారి చుట్టు బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి.

మార్కు 9:15

వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి, మిగుల విభ్రాంతినొంది ఆయనయొద్దకు పరుగెత్తికొనివచ్చి ఆయనకు వందనము చేసిరి.

మార్కు 9:16

అప్పుడాయన మీరు దేనిగూర్చి వారితో తర్కించుచున్నారని వారినడుగగా

మార్కు 9:17

జనసమూహములో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీయొద్దకు తీసికొనివచ్చితిని;

మార్కు 9:18

అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును; అప్పుడు వాడు నురుగు కార్చుకొని, పండ్లు కొరుకుకొని మూర్చిల్లును; దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారిచేత కాలేదని ఆయనతో చెప్పెను

మార్కు 9:19

అందుకాయన విశ్వాసములేని తరమువారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వానిని నాయొద్దకు తీసికొనిరండని వారితో చెప్పగా

మార్కు 9:20

వారాయనయొద్దకు వానిని తీసికొనివచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, వాని విలవిల లాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను.

మార్కు 9:21

అప్పుడాయన ఇది వీనికి సంభవించి యెంతకాలమైనదని వాని తండ్రినడుగగా అతడు బాల్యమునుండియే;

మార్కు 9:22

అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీవలననైతే మామీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను.

మార్కు 9:23

అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.

మార్కు 9:24

వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండ సహాయము చేయుమని బిగ్గరగా చెప్పెను.

మార్కు 9:25

జనులు గుంపుకూడి తనయొద్దకు పరుగెత్తికొని వచ్చుట యేసు చూచి మూగవైన చెవిటిదయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను.

మార్కు 9:26

అప్పుడు అది కేకవేసి, వానినెంతో విలవిల లాడించి వదలిపోయెను. అంతట వాడు చచ్చినవానివలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి.

మార్కు 9:27

అయితే యేసు వాని చెయ్యిపట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను.

మార్కు 9:28

ఆయన ఇంటిలోనికి వెళ్లిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్లగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయన నడిగిరి.

మార్కు 9:29

అందుకాయన ప్రార్థనవలననే గాని మరి దేనివలననైనను ఈ విధమైనది వదలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను.

లూకా 9:37

మరునాడు వారు ఆ కొండదిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను.

లూకా 9:38

ఇదిగో ఆ జనసమూహములో ఒకడు బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను. వాడు నాకొక్కడే కుమారుడు.

లూకా 9:39

ఇదిగో ఒక దయ్యము వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును; నురుగు కారునట్లు అది వానిని విలవిలలాడించుచు గాయపరచుచు వానిని వదలి వదలకుండును.

లూకా 9:40

దానిని వెళ్లగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొఱ్ఱపెట్టుకొనెను.

లూకా 9:41

అందుకు యేసు విశ్వాసములేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలము మీతో కూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొనిరమ్మని చెప్పెను.

లూకా 9:42

వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడించెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రికప్పగించెను.

లూకా 9:43

గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి ఆశ్చర్యపడిరి.

మార్కు 1:40

ఒక కుష్ఠరోగి ఆయనయొద్దకు వచ్చి ఆయనయెదుట మోకాళ్లూని నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి, ఆయనను వేడుకొనగా

మార్కు 10:17

ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తికొనివచ్చి ఆయనయెదుట మోకాళ్లూని సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయుదునని ఆయన నడిగెను.

అపోస్తలులకార్యములు 10:25

పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీద పడి నమస్కారము చేసెను.

అపోస్తలులకార్యములు 10:26

అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి

మత్తయి 9:18

ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను.

లూకా 9:33

(ఆ యిద్దరు పురుషులు) ఆయన యొద్దనుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను.

యోహాను 4:46

తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగివచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియైయుండెను.