మత్తయి 26: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు విని, సంతోషించి వానికి ద్రవ్యమిత్తుమని వాగ్దానము చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను.
వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వానిని చూచి గేహజీ, నీవెచ్చటనుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను.
అతడు ఎలీషాను విడిచివెళ్లి తన యజమానుని యొద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పెననెను.
దుష్టులు తమ మనోభిలాషనుబట్టి అతిశయపడుదురు లోభులు యెహోవాను తిరస్కరింతురు
భక్తిహీనులు నీతిమంతులమీద దురాలోచన చేయుదురు వారిని చూచి పండ్లు కొరుకుదురు.
గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి.
వారు గలిలయలో సంచరించుచుండగా యేసు మనుష్యకుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబడబోవుచున్నాడు,