లేఖనాలను
అన్వేషించండి
మత్తయి 28: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసికొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటివరకు ప్రసిద్ధమైయున్నది."
సంబంధిత రిఫరెన్స్‌లు
అపోస్తలులకార్యములు 12:19
హేరోదు అతని కోసరము వెదకినప్పుడు అతడు కనబడనందున కావలివారిని విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను. అటు తరువాత హేరోదు యూదయనుండి కైసరయకు వెళ్లి అక్కడ నివసించెను.
నిర్గమకాండము 23:1
లేనివార్తను పుట్టింపకూడదు; అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు;
గలతీయులకు 1:10
ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొన జూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్ట గోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తుదాసుడను కాకయేపోవుదును.