లేఖనాలను అన్వేషించండి

మత్తయి 4: 2

క్రాస్-రిఫరెన్స్‌లు

" నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

మార్కు 1:12

వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొనిపోయెను.

మార్కు 1:13

ఆయన సాతానుచేత శోధింపబడుచు అరణ్యములో నలువదిదినములు అడవిమృగములతోకూడ నుండెను; మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి.

మార్కు 1:14

యోహాను చెరపట్టబడిన తరువాత యేసు

మార్కు 1:15

కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది ? మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.

లూకా 4:1

యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నదినుండి తిరిగివచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి

లూకా 4:2

అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమియు తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా

లూకా 4:3

అపవాది నీవు దేవుని కుమారుడవైతే, రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను

లూకా 4:4

అందుకు యేసు మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

లూకా 4:5

అప్పుడు అపవాది ఆయనను తీసికొనిపోయి, భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించి

లూకా 4:6

ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును; అది నాకప్పగింపబడి యున్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును;

లూకా 4:7

కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా యిదంతయు నీదగునని ఆయనతో చెప్పెను.

లూకా 4:8

అందుకు యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

లూకా 4:9

పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసికొనిపోయి, దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడ నుండి క్రిందికి దుముకుము

లూకా 4:10

నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును.

లూకా 4:11

నీ పాదమెప్పుడైనను రాతికి తగులకుండ వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి యున్నదని ఆయనతో చెప్పెను.

లూకా 4:12

అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి యున్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను.

లూకా 4:13

అపవాది ప్రతి శోధనను ముగించి, కొంతకాలము ఆయనను విడిచిపోయెను.

రోమీయులకు 8:14

దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు.

1రాజులు 18:12

అయితే నేను నీయొద్దనుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచుపోవును, అప్పుడు

2రాజులు 2:16

అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మాయొద్ద ఏబదిమంది బలముగలవారున్నారు; మా మీద దయయుంచి నీ గురువును వెదకుటకు వారిని పోనిమ్ము; యెహోవా ఆత్మ అతనిని ఎత్తి యొక పర్వతము మీదనైనను లోయయందైనను వేసి యుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనెను.

యెహెజ్కేలు 3:12

అంతలో ఆత్మ నన్నెత్తికొనిపోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగాక అను శబ్దమొకటి ఆయన యున్న స్థలమునుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని.

యెహెజ్కేలు 3:14

ఆత్మ నన్నెత్తి తోడుకొనిపోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్నిచేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొనిపోయినప్పుడు, యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను.

యెహెజ్కేలు 8:3

మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను.

యెహెజ్కేలు 11:1

పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట ఇరువదియైదుగురు మనుష్యులు కనబడిరి; వారిలో జనులకు ప్రధానులైన అజ్జూరు కుమారుడగు యజన్యాయు బెనాయా కుమారుడగు పెలట్యాయు నాకు కనబడిరి.

యెహెజ్కేలు 11:24

తరువాత ఆత్మ నన్ను ఎత్తి, నేను దైవాత్మవశుడను కాగా, దర్శనములో నైనట్టు కల్దీయులదేశమునందు చెరలో ఉన్నవారియొద్దకు నన్ను దింపెను. అంతలో నాకు కనబడిన దర్శనము కనబడకుండ పైకెక్కెను.

యెహెజ్కేలు 40:2

దేవుని దర్శనవశుడనైన నన్ను ఇశ్రాయేలీయుల దేశములోనికి తోడుకొనివచ్చి, మిగుల ఉన్నతమైన పర్వతముమీద ఉంచెను. దానిపైన దక్షిణపుతట్టున పట్టణమువంటిదొకటి నాకగుపడెను.

యెహెజ్కేలు 43:5

ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసికొనిరాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండియుండెను.

అపోస్తలులకార్యములు 8:39

వారు నీళ్లలోనుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను, నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్లెను; అతడు ఫిలిప్పును మరియెన్నడును చూడలేదు.

ఆదికాండము 3:15

మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమెమీద కొట్టుదువని చెప్పెను.

యోహాను 14:30

ఇకను మీతో విస్తరించి మాటలాడను; ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. నాతో వానికి సంబంధమేమియులేదు.

హెబ్రీయులకు 2:18

తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడువారికిని సహాయము చేయగలవాడైయున్నాడు.

హెబ్రీయులకు 4:15

మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.

హెబ్రీయులకు 4:16

గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము.

న్యాయాధిపతులు 13:25

మరియు యెహోవా ఆత్మజొర్యా కును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను.

కీర్తనలు 89:22

ఏ శత్రువును అతనిమీద జయమునొందడు దోషకారులు అతని బాధపరచరు.

కీర్తనలు 118:13

నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.

లూకా 2:27

అంతట ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసికొనివచ్చినప్పుడు

2కొరిందీయులకు 11:14

ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు

1తిమోతి 3:11

అటువలె పరిచర్య చేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితానుభవము గలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను.

2తిమోతి 3:3

అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు

1పేతురు 5:8

నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.

ప్రకటన 12:9

కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.