లేఖనాలను అన్వేషించండి

నెహెమ్యా 4: 12

క్రాస్-రిఫరెన్స్‌లు

" మా శత్రువులయొద్ద నివాసులైయున్న యూదులు వచ్చి నలుదిక్కులనుండి మీరు మా సహాయమునకు రావలెనని మాటి మాటికి మాతో చెప్పగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 31:7

మీ తండ్రి నన్ను మోసపుచ్చి పదిమార్లు నా జీతము మార్చెను; అయినను దేవుడు అతని నాకు హాని చేయనియ్యలేదు.

ఆదికాండము 31:41

ఇదివరకు నీ యింటిలో ఇరువది యేండ్లు ఉంటిని. నీ యిద్దరి కుమార్తెల నిమిత్తము పదునాలుగేండ్లును, నీ మంద నిమిత్తము ఆరేండ్లును నీకు కొలువు చేసితిని. అయినను నీవు నా జీతము పదిమారులు మార్చితివి.

సంఖ్యాకాండము 14:22

నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన యీ మనుష్యులందరు ఈ పది మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి.

యోబు 19:3

పదిమారులు మీరు నన్ను నిందించితిరి సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు.

దానియేలు 1:20

రాజు వీరియొద్ద విచారణ చేయగా జ్ఞానవివేకముల సంబంధమైన ప్రతివిషయములో వీరు తన రాజ్యమందంతటనుండు శకునగాండ్రకంటెను గారడీవిద్యగల వారందరికంటెను పది యంతలు శ్రేష్ఠులని తెలియబడెను.