నెహెమ్యా 4: 23
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఈలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడియున్న పారావారు గాని ఉదుకుకొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పనిచేయుచు వచ్చిరి.
నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధికారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవుని యెదుట భయభక్తులు గలవాడు.
అబీమెలెకును అతనితో నున్న జనులందరును సల్మోను కొండనెక్కి అబీమెలెకు గొడ్డలినిచేత పట్టుకొని చెట్లనుండి పెద్ద కొమ్మను నరికి యెత్తి భుజముమీద పెట్టుకొనినేను దేనిచేయుట మీరు చూచితిరో మీరును నేను చేసినట్టుగా దానిని త్వరగా చేయుడని తనతోనున్న జనులతో చెప్పెను.
అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని.
విలుకాండ్ర ధ్వనికి దూరముగా నుండువారు నీళ్లు చేదుకొను స్థలములలో నుండువారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు ఇశ్రాయేలీయుల గ్రామములో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు.
అయితే అప్పటినుండి నా పని వారిలో సగము మంది పనిచేయుచు వచ్చిరి, సగముమంది యీటెలును బల్లెములును విండ్లును కవచములును ధరించినవారై వచ్చిరి; అధికారులు యూదులలో ఆ యా యింటివారి వెనుక నిలిచిరి.
ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నియు చక్కగా పోవుచున్నవి ఆయుధములమీద పడినను త్రోవ విడువవు.