సంఖ్యాకాండము 18: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" ప్రతి మగవాడును దానిని తినవలెను; అది నీకు పరిశుద్ధముగా ఉండును."
సంబంధిత రిఫరెన్స్‌లు
మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలును తీసికొని పరిశుద్ధస్థలములో దాని మాంసమును వండవలెను.
అహరోనును అతని కుమారులును ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలెను.
దానిలో మిగిలినదానిని అహరోనును అతని సంతతివారును తినవలెను. అది పులియనిదిగా పరిశుద్ధస్థలములో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణములో దానిని తినవలెను;
పాపపరిహారార్థబలిగా దానినర్పించిన యాజకుడు దానిని తినవలెను; పరిశుద్ధస్థలమందు, అనగా ప్రత్యక్షపు గుడారముయొక్క ఆవరణములో దానిని తినవలెను.
యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
కావున మీరు పరిశుద్ధస్థలములో దానిని తినవలెను; నేను అట్టి ఆజ్ఞను పొందితిని.
మీరు పరిశుద్ధస్థలములో ఆ పాపపరిహారార్థబలి పశువును ఏల తినలేదు? అది అతిపరిశుద్ధము గదా. సమాజము యొక్క దోషశిక్షను భరించి యెహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా.
అతడు పాపపరిహారార్థబలి పశువును దహనబలి పశువును వధించు పరిశుద్ధస్థలములో ఆ గొఱ్ఱపిల్లను వధింపవలెను. పాపపరిహారార్థమైన దానివలె అపరాధపరిహారార్థమైనదియు యాజకునిదగును; అది అతిపరిశుద్ధము.
అహరోను సంతతిలో ప్రతివాడును దానిని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును.
యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము.
అది అతిపరిశుద్ధము, పరిశుద్ధస్థలములో దానిని తినవలెను.
అతిపరిశుద్ధమైనవేగాని, పరిశుద్ధమైనవేగాని, తన దేవునికి అర్పింపబడు ఏ ఆహారవస్తువులనైనను అతడు తినవచ్చును.
దాని పులియబెట్టి కాల్చవలదు; నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాని నిచ్చియున్నాను. పాపపరిహారార్థబలివలెను అపరాధపరిహారార్థబలివలెను అది అతిపరిశుద్ధము.
అప్పుడు మోషే అహరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోను ఇట్లనెను మీరు యెహోవా హోమ ద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసికొని అది పొంగకుండ బలిపీఠము దగ్గర తినుడి; అది అతిపరిశుద్ధము. యెహోవా హోమ ద్రవ్యములోనుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు.
అప్పుడాయన నాతో ఇట్లనెను విడిచోటునకు ఎదురుగానున్న ఉత్తరపు గదులును దక్షిణపు గదులును ప్రతిష్ఠితములైనవి, వాటిలోనే యెహోవా సన్నిధికి వచ్చు యాజకులు అతిపరిశుద్ధ వస్తువులను భుజించెదరు, అక్కడ వారు అతిపరిశుద్ధ వస్తువులను, అనగా నైవేద్యమును పాపపరిహారార్థ బలిపశుమాంసమును అపరాధపరిహారార్థ బలిపశుమాంసమును ఉంచెదరు, ఆ స్థలము అతిపరిశుద్ధము.