లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 23: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" బిలాము ఇక్కడ నాకు ఏడు బలి పీఠములను కట్టించి, యిక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 23:1

అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు ఏడు బలిపీఠములను కట్టించి, ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పెను.

సంఖ్యాకాండము 23:2

బిలాము చెప్పినట్లు బాలాకు చేయగా, బాలాకును బిలామును ప్రతి బలిపీఠముమీద ఒక కోడెను ఒక పొట్టేలును దహనబలిగా అర్పించిరి.

సంఖ్యాకాండము 22:17

నేను నీకు బహు ఘనత కలుగజేసెదను; నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసెదను గనుక నీవు దయచేసి వచ్చి, నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి.

సంఖ్యాకాండము 23:14

పిస్గా కొననున్న కావలివారి పొలమునకు అతని తోడుకొనిపోయి, యేడు బలిపీఠములను కట్టించి, ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించెను.

1దినవృత్తాంతములు 15:26

యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయముచేయగా వారు ఏడు కోడెలను ఏడు గొఱ్ఱపొట్టేళ్లను బలులుగా అర్పించిరి.

2దినవృత్తాంతములు 29:21

రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలముకొరకును యూదావారి కొరకును పాపపరిహారార్థబలి చేయుటకై యేడు కోడెలను ఏడు పొట్టేళ్లను ఏడు గొఱ్ఱపిల్లలను ఏడు మేకపోతులను వారు తెచ్చియుంచిరి గనుక అతడు యెహోవా బలిపీఠముమీద వాటిని అర్పించుడని అహరోను సంతతివారగు యాజకులకు ఆజ్ఞాపించెను.

యోబు 42:8

కాబట్టి యేడు ఎడ్లను ఏడు పొట్టేళ్లను మీరు తీసికొని, నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహనబలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమునుబట్టి మిమ్మును శిక్షింపక యుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను; ఏలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్నుగూర్చి యుక్తమైనది పలుకలేదు.

మీకా 6:6

ఏమి తీసికొనివచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసికొనివచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారముచేతును? దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా?