లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 34: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" మనష్షే అర్ధగోత్రపువారు తమ స్వాస్థ్యమునొందిరి. ఆ రెండు గోత్రపువారును అర్ధగోత్రపువారును సూర్యోదయ దిక్కున, అనగా తూర్పుదిక్కున యెరికోయొద్ద యొర్దాను ఇవతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 32:32

మేము యెహోవా సన్నిధిని యుద్ధసన్నద్ధులమై నదిదాటి కనాను దేశములోనికి వెళ్లెదము. అప్పుడు యొర్దాను ఇవతల మేము స్వాస్థ్యమును పొందెదమని ఉత్తరమిచ్చిరి.

సంఖ్యాకాండము 22:1

తరువాత ఇశ్రాయేలీయులు సాగి యెరికోకు ఎదురుగా యొర్దాను తీరముననున్న మోయాబు మైదానములలో దిగిరి.

సంఖ్యాకాండము 32:19

తూర్పుదిక్కున యొర్దాను ఇవతల మాకు స్వాస్థ్యము దొరికెను గనుక యొర్దాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిరి.

ద్వితియోపదేశాకాండము 1:1

యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.