సంఖ్యాకాండము 36: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా సెలోపెహాదు కుమార్తెలనుగూర్చి సెలవిచ్చిన మాట ఏదనగా వారు తమకు ఇష్టులైనవారిని పెండ్లి చేసికొనవచ్చును గాని వారు తమ తండ్రి గోత్రవంశములోనే పెండ్లి చేసికొనవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
వారు యోసేపు కుమారులైన మనష్షీయులను పెండ్లి చేసికొనిరి గనుక వారి స్వాస్థ్యము వారి తండ్రి గోత్రవంశములోనే నిలిచెను.
నేను ఎవరిమధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక
వారు ఆ చిన్నదానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని
రిబ్కాను పిలిచి ఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడు వెళ్లెదననెను.
మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు?
వారికి వ్యాజ్యెము ఏదైనను కలిగినయెడల నాయొద్దకు వచ్చెదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి, దేవుని కట్టడలను ఆయన ధర్మశాస్త్రవిధులను వారికి తెలుపుచున్నానని తన మామతో చెప్పెను.
యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలుండిరి కాని కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసికొనిరి.