సామెతలు 30: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును."
సంబంధిత రిఫరెన్స్‌లు
పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు ఆలాగున నరుల దృష్టి తృప్తికానేరదు.
మరియు ద్రాక్షారసము మోసకరము, తననుబట్టి అతిశయించువాడు నిలువడు, అట్టివాడు పాతాళమంత విశాలముగా ఆశపెట్టును, మరణమంతగా ప్రబలినను తృప్తినొందక సకలజనములను వశపరచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును.
ఎడతెరిపిలేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింపజాలరు; చూచుటచేత కన్ను తృప్తి పొందకున్నది, వినుటచేత చెవికి తృప్తి కలుగుటలేదు.
ద్రవ్యము నపేక్షించువాడు ద్రవ్యముచేత తృప్తి నొందడు, ధనసమృద్ధి నపేక్షించువాడు దానిచేత తృప్తి నొందడు; ఇదియు వ్యర్థమే.
మనస్సు అడియాశలు కలిగి తిరుగులాడుటకన్న ఎదుట నున్నదానిని అనుభవించుట మేలు; ఇదియు వ్యర్థమే, గాలికై ప్రయాసపడినట్టే.
వారికి ద్రాక్షారసము చేదాయెను, ఒళ్లు తెలియనివారు; మానక వ్యభిచారము చేయువారు; వారి అధికారులు సిగ్గుమాలినవారై అవమానకరమైన దానిని ప్రేమింతురు.